ప్రకాశం: దర్శి నగర పంచాయతీ పరిధిలోని ప్రజలు పన్నులను త్వరగా చెల్లించాలని కమిషనర్ మహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ.. మార్చి 31, 2025 నాటికి ప్రజలు తప్పనిసరిగా పన్నులు చెల్లించాలన్నారు. అందరూ త్వరగా పన్నులు కడితేనే నగర పంచాయతీ అభివృద్ధి చెందుతుందని చెప్పారు.