కృష్ణా: టీడీపీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల బెయిల్పై ఇవాళ తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తాజాగా అరెస్ట్ చేశారు. కేసులో 88 మందిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే 45మందిని అరెస్ట్ చేశారు. కాగా ఫిర్యాదుదారుడు సత్యవర్దన్ తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, భయపెట్టి ఫిర్యాదు చేయించారన్నారు.