NLR: వరికుంటపాడు మండలంలోని ఇరువురు గ్రామంలో మంగళవారం మండల వైద్యాధికారిని ఆయేషా 104 వాహన వైద్య సేవలను అందించారు. ఆమె 53 మందిని పరీక్షించి ఉచితంగా మందులు అందించారు. అలాగే ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. దీర్ఘకాలిక రోగులు మారిన వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చలికాలంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.