CTR: పుంగనూరు ICDS ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న రెండు అంగన్వాడి సహాయకురాలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు CDPO రాజేశ్వరి సోమవారం తెలిపారు. పుంగనూరు అర్బన్ రాంనగర్ అంగన్వాడి సహాయకురాలు (OC) కేటగిరీ, సోమల మండలం ముండ్రివారిపల్లె సహాయకురాలు (BC-D) కేటగిరీలో అవకాశం ఉన్నట్లు తెలిపారు. అర్హులు ఈ నెల 22తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.