చిత్తూరు: గంగవరం మండలం ఎర్రమనగుంట చెరువు వద్ద ఆటోలో సోమవారం ఓ వ్యక్తి డెడ్ బాడీ లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా మరెవరైనా హత్య చేసి శవాన్ని అక్కడే వదిలి వెళ్లారా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.