W.G: ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం పేరాబత్తుల రాజశేఖరం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఏలూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని రాజశేఖరానికి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.