VZM: రైతులందరికీ భూ ఆధార్ కార్డు తప్పనిసరి అని మండల వ్యవసాయ అధికారిణి పూర్ణిమ సూచించారు. మండలంలోని చంద్రంపేట గ్రామంలో భూ ఆధార్ నంబర్ నమోదు చేసే కార్యక్రమంపై సోమవారం రైతులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు భూ ఆధార్ నంబర్ పొందాలన్నారు. సదరు ఆధార్ ద్వారా ప్రతి రైతుకు గుర్తింపు నంబర్ ఇవ్వాలని చెప్పారు.