W.G: ఆచంట మండలం కొడమంచిలి గ్రామంలో మద్యం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న ఎస్.వెంకటనారాయణను సోమవారం పాలకొల్లు ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఆరు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు జి.రఘు, పి.మహేశ్లు పాల్గొన్నారు. బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.