చిత్తూరు: సదుంలోని వారపు సంతలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. పనుల వివరాలను కాంట్రాక్టర్ సోమశేఖర్ రెడ్డి ఆయనకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ధనుంజయ రెడ్డి, వార్డు సభ్యుడు భాస్కర, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.