అనంతపురం: గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. మండల తహశీల్దార్ ఓబులేసుకు భూ సమస్యలపై రైతులు అర్జీలను సమర్పించారు. తహశీల్దార్ మాట్లాడుతూ.. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు భూ సమస్యలపై అలాగే పట్టణంలోని నిరుపేదలు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని అర్జీలను ఇచ్చారన్నారు. వాటికి త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు.