అనంతపురం: తాడిపత్రి మండలంలో ఎమ్మేల్యే జేసీ అస్మిత్ రెడ్డి సోమవారం పర్యటించారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, వెంకటంపల్లి గ్రామాలలో అధికారులతో కలిసి గ్రామ సభ నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుంటూ వాటికి వెంటనే పరిష్కార మార్గం చూపాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మండల అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.