TG: హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద గ్రామీణ వైద్యులు ధర్నా చేపట్టారు. తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. RMP, PMPలపై మెడికల్ కౌన్సిల్ దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. తమకు శిక్షణ తరగతులు నిర్వహించాలని, హెల్త్ గైడ్లుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.