NTR: గంపలగూడెం మండలం కొణిజెర్లకు చెందిన నంబూరు వరుణ్‌కు అమెరికా అమ్మాయితో వివాహమైంది. వరుణ్ USAలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో షర్లెట్కు చెందిన ఎరికాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త పెళ్లిగా మారింది. ఇరు కుటుంబాల సమక్షంలో శుక్రవారం రాత్రి కొణిజెర్లలో వివాహం చేసుకున్నారు. నూతన వధూవరులను కుటుంబ సభ్యులు ఆశీర్వదించారు.