SKLM: కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు గ్రామ దేవత సింధుపోలమ్మ గుడి రోడ్డులో సీసీ డ్రైనేజ్ నిర్మాణానికి శనివారం పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని మండల టీడీపీ కార్యదర్శి మాదిన రామారావు అన్నారు.