SKLM: జలుమూరు మండలం సురవరంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై పి అశోక్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా వెంకటరమణ అనే వ్యక్తి 72 మద్యం సీసాలతో సురవరం గ్రామానికి వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. తక్షణం నిందితుడుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.