ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. దాదాపు 7 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. బీజేపీ 43 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఆప్ 27 స్థానాల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేదు. సుమారు 8 స్థానాల్లో వెయ్యి ఓట్ల తేడాతో బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ 7వ రౌండ్ తర్వాత వెనకంజలో ఉన్నారు.