ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీమంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ సెటైర్ వేశారు. బీజేపీని గెలిపించిన రాహుల్కు శుభాకాంక్షలు అని ఎద్దేవా చేశారు. కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ విజయం దిశగా దూసుకెళ్తోంది. మళ్లీ తమదే అధికారమన్న ఆప్ వెనుకంజలో ఉంది.