హైద్రాబాద్: ఎల్బీనగర్ పరిధి చంపాపేట డివిజన్ ఉదయ నగర్ కాలనీలో కాంగ్రెస్ తెలంగాణ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్ పర్యటించారు. కాలనీ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీలైనంత తొందరలోనే కాలనీలోని సమస్యలు తీరుస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.