TPT: డిజిటల్ అరెస్ట్ ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తూ కోట్లు దోచుకుంటున్న ముఠాను తిరుపతి జిల్లా పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఒక ముద్దాయి అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.24.5 లక్షలు నగదు, రెండు సెల్ ఫోన్లు,రెండు ల్యాప్ టాప్లు, ఒక కారు, 16 గ్రాములు బంగారు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు.