MNCL: మల్టీ లెవెల్ స్కీమ్స్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనరేట్ సీపీ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటన పట్ల ఆకర్షితులై మోసపోవద్దని హెచ్చరించారు. అనేక స్కీములతో బురిడీ కొట్టిస్తున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడితే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.