NRML: ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాలలో ఫీల్డ్ సర్వేను ఆ మండల అధికారులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. గురువారం ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి, తర్లపాడ్, సేవ నాయక్ తండ గ్రామాలలో పర్యటించి సిబ్బంది నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివరాజ్, ఎంపీడీవో సునీత, ఎంపీఓ రత్నాకర్ ఉన్నారు.