ELR: కలిదిండి మండలం కలిదిండి గ్రామంలో బీజేపీ పార్టీ మండల కమిటీ ఎన్నిక సమావేశం ఆదివారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కలిదిండి బీజేపీ మండలపార్టీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అంకాళ దుర్గ ప్రసాద్ని సభ్యులు ఎన్నుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆయనను అభినంధించి పార్టీ బలోపేతానికి కృషిచేయ్యాలన్నారు.