SRCL: ఇల్లంతకుంట మండలంలో ప్రసిద్ధి చెందిన అంతగిరి శ్రీ ముత్యాల పోచమ్మ దేవస్థానానికి వెళ్లే రహదారి గుంతలమయంగా ప్రమాదకరంగా తయారైంది. నిత్యం వేలాదిమంది భక్తులు ఆలయ దర్శనానికి ఇదే రోడ్డు గుండా ప్రయాణిస్తున్నారు. గుంతల రహదారిపై ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని వారు తెలిపారు. సంబంధిత అధికారులు రోడ్డు మరమ్మతు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.