KNR: కాంగ్రెస్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాజీమంత్రి కేటీఆర్‌పై తప్పుడు కథనాలు సృష్టిస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.