NLR: ఈ నెల 31న పింఛన్లు అందజేస్తామని పంచాయతీ అధికారులు మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో ఆదివారం వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. జనవరి 1న కొత్త సంవత్సరం కావడంతో పింఛన్లు ఒక రోజు ముందుగానే ఇస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వాయిస్ రికార్డ్ చేసి ఓ వ్యక్తితో సైకిల్‌పై గ్రామాలలో మైక్ ద్వారా ప్రచారం నిర్వహించారు.