PDPL: పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బొంపల్లికి చెందిన సత్తమ్మ అనే వృద్ధురాలికి, పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి ఆమె మెడలో పుస్తెలతాడును ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితురాల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో దొంగను పోలీసులు పట్టుకున్నారు. 20 గ్రాముల పుస్తెలతాడును అందజేశారు.