E.G: రబీసాగుకు తూర్పు, మధ్య, సెంట్రల్ డెల్టా కాలువలకు ఆదివారం రాత్రి దవలేశ్వరం బ్యారేజ్ నుంచి 11,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,300, మధ్య డెల్టాకు 2,150, పశ్చిమడెల్టాకు 5,750 క్యూసెక్కులు నీటిని వదిలారు. బ్యారేజ్ వద్ద 10.90 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజ్ నుంచి ఏవిధమైన మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేయలేదు.