SKLM: వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాశిబుగ్గ పట్టణానికి చెందిన శివ(24) మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు కాశీబుగ్గ న్యూ కాలనీలో నివాసం ఉంటూ.. ఓ ప్రముఖ డాక్టర్ వద్ద కార్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలం క్రితం తండ్రి, అక్క భర్త (బావ) మృతి చెందగా.. తల్లిని, సోదరిని పోషిస్తూ.. కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.