PDPL: పట్టణంలోని 11వ వార్డు పరిధిలోని రంగంపల్లి బృందావన్ గార్డెన్ వద్ద టీయూఎఫ్ ఐడీసీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులున్నారు.