KMR: తాడ్వాయి మండలంలో యాసంగి వరినాట్లు ఊపందుకున్నాయి. కూలీల కొరతతో రైతులు వలస కూలీలతో వరి నాట్లు నాటిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట, ఓడిస్సా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూలీలను వరినాట్ల కోసం రైతులు ఉపయోగిస్తున్నారు. దీంతో మండలంలోని అన్ని గ్రామాలలో వరి నాట్లు జోరందుకున్నాయి.