NZB: జాతీయస్థాయి ఫీస్ట్ బాల్ ఛాంపియన్షిప్లో నిజామాబాద్ జిల్లా పడకల్ గ్రామానికి చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ ప్రదర్శించారు. తమిళనాడులో ముగిసిన ఈటోర్నీలో సబ్ జూనియర్, సీనియర్ బాల బాలికల విభాగంలో పడకల్ గ్రామానికి చెందిన శివరాం చరణ్, వర్ధన్, కళ్యాణి, జగదీశ్వరి, సలోని, తేజ తమ విభాగాలలో ప్రతిభను ప్రదర్శించి జట్టు విజయానికి కీలకపాత్ర పోషించారని పిడి తెలిపారు.