NDL: నంద్యాలలోని కలెక్టరేట్ సెంటినరీ హాలులో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. సోమవారం ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంకు హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.