NRML: రాష్ట్ర స్థాయి సీఎం కప్-2024 క్రీడా పోటీల్లో దస్తూరాబాద్ క్రీడాకారుడు ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. రాష్ట్ర స్థాయిలో జరిగిన సీఎం కప్ వెయిట్ లిఫ్టింగ్-102 కిలోల విభాగంలో మున్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కొట్టే అభిషేక్ కాంస్య పథకాన్ని సాధించాడు. కాగా అభిషేక్‌ను హెచ్ఎం వామన్‌రావు, ఉపాధ్యాయులు అభినందించారు.