NDL: పాణ్యం మండలం కౌలూరు గ్రామ శివారులో ఉన్న రైల్వే గేట్‌ను సోమవారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు మూసివేయనున్నారు. రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల నిమిత్తం ఈ గేట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గం నుంచి వెళ్లే ప్రయాణికులు గమనించి ఇతర రహదారుల ద్వారా ప్రయాణాలు సాగించాలని కోరారు.