NLG: పోరాటాల పురిటి గడ్డపై CPI దశాబ్ది ఉత్సవాల బహిరంగ సభను నేడు నిర్వహిస్తున్నట్లు CPI రాష్ట్ర కార్యదర్శి, MLA సాంబశివరావు తెలిపారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమాలకు పురుడు బోసిన నల్గొండ గడ్డ ఎంతోమంది కమ్యూనిస్టు లీడర్లు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతమని అన్నారు. నల్గొండలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.