CTR: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలలో పదిసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన పాపం జగన్ దేనని ప్రభుత్వ విప్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన గంగాధర నెల్లూరులో మాట్లాడుతూ.. జగన్ అవినీతి కారణంగా ప్రజలపై ఒక లక్ష, 29 వేలకోట్ల విద్యుత్ భారాన్ని మోపారని తెలిపారు.