కృష్ణా: పేదల బియ్యాన్ని బొక్కేసిన మాజీ మంత్రి పేర్ని నానికి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. “నీకే కాదు నీ బినామీలకు కూడా నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి. భార్యని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరగాడు. పోలీసులను బెదిరించేందుకే నాని ప్రెస్ మీట్ పెట్టాడు” అంటూ మండిపడ్డారు.