TPT: తిరుపతి రూరల్ మండలం తనపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రగిరి ఎమ్మెల్యే నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జనవరి 3న నారావారిపల్లి టీటీడీ కల్యాణ మండపంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. 20 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు.