KRNL: పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబళం గ్రామ సహకార సంఘంలోని ఖాతాదారులందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సొసైటీ సీఈఓ నరసింహమూర్తి తెలిపారు. సొసైటీలోని సభ్యులు ఈకేవైసీ చేయించుకున్నట్లయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు వర్తిస్తాయని, లేకపోతే లభించవని తెలిపారు. అలాగే సొసైటీ ఓటుహక్కు కూడా లభిస్తుందన్నారు.