అనంతపురం: శ్రీనగర్ కాలనీలో 80ఫిట్ మార్గంలో జరుగుతున్న రోడ్డు పనులను అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు పనులు వేగవంతం చేయాలని సదరు కాంట్రాక్టర్కు సూచించారు.