WNP: అనధికారిక సెలవుల్లో ఉన్న పంచాయతీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎంపీడీవోలను ఆదేశించారు. శనివారం ఆయన పానగల్ మండలంలోని వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విధుల్లో పాల్గొనకుండా అనధికారిక సెలవుల్లో ఉన్న పంచాయతి కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేయాలని ఆదేశించారు.