WNP: జిల్లాలో 3 కొత్తగా మండలాలు, 11 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు శనివారం పంపారు. వెల్టూరు, బలిజపల్లి జంగమాయపల్లి, సోలిపూర్ మూడింటిని మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగా గ్రామపంచాయతీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన 11 గ్రామాల్లో అత్యధికంగా తండాలే ఉన్నట్లు తెలిపారు.