JGL: జగిత్యాల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు కరీనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా సంజయ్‌ని శాలువాతో సన్మానించారు. ఇందులో జగిత్యాల నియోజకవర్గం భాజపా కన్వీనర్, న్యాయవాది చిలకమర్రి మధన్ మోహన్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు పాల్గొన్నారు.