BNR: యాదగిరిగుట్ట మండలం చీకటిమామిడి గ్రామంలో సర్వే నెంబర్ 506లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. అట్టి నిర్మాణాలను నిలిపివేయాలని యువకులు, గ్రామ పెద్దలు బొమ్మలరామరం ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేశారు.