MDK: శివంపేట మండలం సికింద్లాపూర్ గ్రామంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శనివారం 13వ రోజు సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజలు నిర్వహించారు. స్వామివారిని రంగురంగుల పూలు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.