ప్రకాశం: కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్లో గురువారం పట్టణ టీడీపీ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మీడియా సమావేశం నిర్వహించారు. విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని విమర్శించారు. సంక్షోభంలోకి నెట్టిన వైసీపీ నేడు విద్యుత్ ఛార్జీలు పెరిగాయని ధర్నాలకు పాల్పడటం సిగ్గుచేటని విమర్శించారు.