W.G: పెదవేగి సీఐ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి శనివారం పెదపాడు మండలంలో వాహనాలు తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు వాహన యజమాని, చెరువు యజమాని, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అలాగే చేపల చెరువుల్లో కోళ్ల వ్యర్ధాలను కలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.