PLD: పిడుగురాళ్ల నుంచి దాచేపల్లికి బైక్‌పై వినోద్, వెంకటేశ్ అనే ఇద్దరు యువకులు వస్తుండగా బ్రాహ్మణపల్లి పరిధిలో శనివారం తెల్లవారుజామున అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొట్టి ఇద్దరు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో వినోద్ చనిపోగా.. వెంకటేశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.