పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ ‘OG’. తాజాగా ఈ సినిమాను ఉద్దేశించి నటి శ్రియారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో తన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నారు. ‘సలార్’లో తాను పోషించిన పాత్రకు.. ఈ మూవీలోని రోల్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇందులో తన పాత్రను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని చెప్పారు.