ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 2’ సినిమాను నటి ఖుష్బూ వీక్షించారు. ఈ మూవీపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు. ‘సినిమా అద్భుతంగా ఉంది. ప్రతి ఫేమ్‌లో టీం అందరి హార్డ్ వర్క్ కనిపిస్తుంది. తాను ఒక అద్భుతమైన టెక్నీషియన్ అని సుకుమార్ మరోసారి నిరూపించుకున్నారు. రష్మిక, అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్. చిత్రబృందానికి కంగ్రాట్స్’ అంటూ రాసుకొచ్చారు.